Balineni Srinivasa Reddy: నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుంది...! 26 d ago
సెకీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనగోళ్ల ఒప్పందంపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెకీ ఒప్పందంలో తాను ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందన్నారు. తాను సెకీ ఒప్పందంలో వాటా తీసుకున్నాని చెవిరెడ్డి విమర్శిస్తున్నారని, దానర్థం వైఎస్ జగన్ కూడా వాటా తీసుకున్నట్లే కదా అని లాజిక్ తీశారు. గత ఐదేళ్లలో జరిగినదానిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సెకీ ఒప్పందంపై త్వరగా విచారణ పూర్తి చేసి, నిజాలు తేల్చాలన్నారు.